• బ్యాంకింగ్ సేవలు
  • ప్రతి ఒక్కరికీ - సురక్షితంగా మరియు తక్షణం ప్రాథమిక బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవలు అందించడం ద్వారా పట్టణ మరియు గ్రామీణ భారతదేశాల మధ్య డిజిటల్ విభజనను తగ్గించడానికి స్పైస్ మనీ కట్టుబడి ఉంది. స్పైస్ మనీ బ్యాంకింగ్ పరిష్కారాలనేవి నగదు డిపాజిట్, విత్‌డ్రాయల్‌లు మరియు మనీ ట్రాన్స్‌ఫర్ లాంటి సేవలను భారతదేశంలోని బ్యాంకింగ్ సేవలకు తక్కువ ప్రాప్యత కలిగిన జనాభాకు సులభంగా అందుబాటులోకి తెచ్చాయి. పటిష్టమైన స్పైస్ మనీ అధికారి నెట్‌వర్క్ ద్వారా, ఎవరైనా సరే వారి బ్యాంకులను సందర్శించకుండానే ఇప్పుడు ఈ సేవలు పొందవచ్చు.

AePS (ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్)

స్పైస్ మనీ AePS సేవ అనేది వినియోగదారులు వారి ఆధార్ కార్డ్‌ ఉపయోగించి, ఆధార్-లింక్ చేయబడిన వారి బ్యాంక్ ఖాతాను యాక్సెస్ చేయడానికి మరియు విత్‌డ్రాయల్‌లు, డిపాజిట్లు, బ్యాలెన్స్ విచారణ మరియు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్‌లు వంటి ప్రాథమిక బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించడానికి అవకాశం కల్పిస్తుంది. సురక్షితమైన బయోమెట్రిక్ స్కానర్‌ ఉపయోగించి ఈ లావాదేవీలను సులభంగా చేయవచ్చు. డిజిటల్ దుకాన్‌ ద్వారా, స్పైస్ మనీలోని అధికారులందరి వద్ద ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

AePS (ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్)
తక్షణ నగదు బదిలీ సేవ

నగదు బదిలీ (DMT)

విస్తృత నెట్‌వర్క్‌లోని వివిధ బ్యాంకుల మధ్య స్పైస్ మనీ వినియోగదారులు నగదు బదిలీ చేయవచ్చు. అధికారుల సహాయంతో, భారతదేశంలోని అన్ని ప్రధాన జాతీయ మరియు ప్రైవేట్ బ్యాంకులకు వారు నిధులు పంపగలరు. వాంఛనీయ భద్రతను నిర్ధారించడం కోసం బహుళ ప్రమాణీకరణ స్థాయిలతో సురక్షి తమైన నగదు బదిలీ ప్రక్రియ ఇది. స్పైస్ మనీ వాలెట్ అనేది RBI ఆమోదించబడిన సెమీ-క్లోజ్డ్ PPI వాలెట్. నగదు పంపే వారి మొబైల్ నంబర్‌కు ఇది లింక్ చేయబడి ఉంటుంది. ఇది చాలా సురక్షితమైనది.

మినీ ATM ద్వారా నగదు విత్‌డ్రాయల్

స్పైస్ మనీ MiniATM సహాయంతో, అధికారులు ఇప్పుడు డెబిట్ మరియు క్రెడిట్ కార్డులతో తమ వినియోగదారుల కోసం నగదు విత్‌డ్రా చేయవచ్చు. రూపే, మాస్టర్, వీసా మరియు మాస్ట్రో వంటి అన్ని ప్రధాన కార్డ్‌లతో మీరు నగదు విత్‌డ్రా చేయవచ్చు.

మినీ ATM ద్వారా నగదు విత్‌డ్రాయల్